Budda Venkanna: విచారణ కోసం జగన్ అమెరికాకు వెళ్తే.. జీవితాంతం ఏపీకి తిరిగిరాడు: బుద్దా వెంకన్న

Budda Venkanna said Jagan will not come back to AP if he go to USA in bribe case
  • అధికారమదంతో నాని, వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడారన్న వెంకన్న
  • చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదని వ్యాఖ్య
  • వీళ్లను చూసి పోసాని కూడా అడ్డగోలుగా వాగాడని విమర్శ
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ నుంచి రూ. 1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు అమెరికాలో నమోదైన కేసు విచారణకు జగన్ వెళితే కనుక... ఇక ఎప్పటికీ ఆయన ఏపీకి తిరిగి రాలేరని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అధికారమదంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటికొచ్చినట్టు వాగారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదని... అలాంటి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. నాని, వంశీ వంటి వెధవలను చూసి పోసాని కృష్ణమురళి కూడా అడ్డగోలుగా వాగాడని విమర్శించారు. 

కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని, దేవినేని అవినాశ్ వంటి వారు క్షమార్హులు కాదని వెంకన్న అన్నారు. ఇలాంటి వెధవలకు శిక్షలు పడితే ఇతరులకు గుణపాఠం అవుతుందని తెలిపారు. వాళ్ల మాదిరి తాము డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదని చెప్పారు. తాము ఏనాడూ భారతీరెడ్డి గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇప్పుడు టచ్ చేస్తే చేయి తీసేస్తారని హెచ్చరించారు.
Budda Venkanna
Telugudesam
Kodali Nani
Vallabhaneni Vamsi
Posani Krishna Murali
YSRCP

More Telugu News