Supreme Court: జీహెచ్‌ఎంసీలో హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్‌!

Supreme Court Cancelled Land Allocation For Housing Societies In GHMC
  • జీహెచ్‌ఎంసీలో హౌసింగ్‌ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయ‌స్థానం
  • హౌసింగ్‌ సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులపై రావు బీ చెలికాని పిటిషన్
  • తాజాగా విచార‌ణ జ‌రిపి తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు
అధికారులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వాలు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ భూ కేటాయింపుల‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు భూ కేటాయింపుల‌ను ర‌ద్దు చేస్తూ తుది తీర్పును వెల్ల‌డించింది.

ఇక ఇటీవ‌ల‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలో సభ్యులకు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఇళ్ల స్థలాలు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఇళ్ల‌ స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం అంద‌జేశారు. అయితే తాజాగా వెలువ‌డిన‌ సుప్రీంకోర్టు తీర్పుతో హౌసింగ్‌ సొసైటీలు పొందిన ఈ భూముల విషయమై సందిగ్ధత‌ నెలకొంది.
Supreme Court
GHMC
Housing Societies
Telangana

More Telugu News