Ajit Pawar: మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ... స్పందించిన అజిత్ పవార్

Ajit Pawar shares big update on Maharashtra CM discussion within Mahayuti
  • భాగస్వామ్య పార్టీలు కలిసి సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటాయన్న పవార్
  • కూటమి పార్టీలు తమ తమ నాయకుడిని ఎన్నుకున్నట్లు చెప్పిన అజిత్ పవార్
  • శాసన సభా పక్ష నేతలుగా ఎన్నికైన తాము కూర్చొని మాట్లాడుకుంటామన్న పవార్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మద్దతు పలికారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎం పదవి రేసులో ఫడ్నవీస్ ముందున్నారు. సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అదే పదవిలో కొనసాగాలనుకుంటున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి సీఎం పదవి రావాలని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అంశంపై అజిత్ పవార్ స్పందించారు.

భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. అసెంబ్లీలో ఎన్సీపీ నేతగా తనను తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని తెలిపారు. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఎన్నికైనట్లు తెలిపారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు.

మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో ముగియనుంది. గెలిచిన కూటమి ఆ తర్వాత 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 సీట్లు అవసరం.
Ajit Pawar
NCP
Devendra Fadnavis

More Telugu News