K Kavitha: వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిపై స్పందించిన కవిత

Kavitha responds on Vankidi student death

  • ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థత
  • పరిస్థితి విషమించడంతో విద్యార్థిని శైలజ నిమ్స్‌కు తరలింపు
  • తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్
  • ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలు తీస్తోందని కవిత ఆగ్రహం

వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్‌కు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 3వ తేదీన వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో శైలజ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందని, కన్నతల్లికి కడుపు కోత మిగిల్చిందని కవిత మండిపడ్డారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తనను ఎంతగానో కలచి వేసిందన్నారు.

నాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందని ఆరోపించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలేనని కవిత ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News