Naga Chaitanya: నాగచైతన్య - శోభితల పెళ్లి గురించి కీలక అప్డేట్!

Update on Naga Chaitanya and Sobhita Dhulipala marriage
  • డిసెంబర్ 4న చైతూ, శోభిత పెళ్లి
  • బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక
  • పెళ్లికి 300 మంది గెస్టులు హాజరుకానున్నట్టు సమాచారం
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం జరగనుందట. శోభిత తల్లిదండ్రుల కోరిక మేరకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగబోతోందని చెపుతున్నారు. 4వ తేదీ రాత్రి 8.13 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరగనుంది. ఈ పెళ్లికి 300 మంది గెస్ట్ లు హాజరుకానున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతం నాగచైతన్య 'తండేల్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Naga Chaitanya
Sobhita Dhulipala
Tollywood
Bollywood

More Telugu News