Ram Gopal Varma: వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసుల నమోదు

9 cases filed against Ram Gopal Varma in AP and Telangana

  • వర్మ కోసం గాలిస్తున్న 6 పోలీసు బృందాలు
  • అరెస్ట్ భయంతో అజ్ఞాతంలో ఉన్న వర్మ
  • వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెల్లిపోయారు.

వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఒక వీడియోను వర్మ విడుదల చేశారు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News