Keerthy Suresh: స్నేహితుడు ఆంటోనీతో పెళ్లిపై నటి కీర్తి సురేశ్‌ అధికారిక ప్రకటన

Actress Keerthy Suresh Confirms Her Relation With Anotny
  • వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు
  • ఇద్దరి మధ్య 15 ఏళ్లకుపైగా రిలేషన్
  • ఇది ఇకపై జీవితాంతం కొనసాగుతుందని కీర్తి పోస్ట్
  • కంగ్రాట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న సెలబ్రిటీలు, అభిమానులు
తన పెళ్లి వార్తలపై వస్తున్న పుకార్లకు నటి కీర్తి సురేశ్ తెరదించారు. స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో దిగిన ఫొటోను షేర్ చేసిన కీర్తి.. తమ 15 ఏళ్ల బంధం ఇక జీవితాంతం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆమె పోస్టుపై సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తూ శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. తనకు ఇప్పుడే తెలిసిందని, కంగ్రాట్స్ లవ్ అంటూ నటి రాశీఖన్నా స్పందించింది. అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆంటోనీ కొంతకాలం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాడు. కేరళలో అతడికి పలు వ్యాపారాలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని చూసుకుంటున్నట్టు తెలిసింది. పెద్దల అంగీకారంతోనే ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ కీర్తి సురేశ్ ఈ అధికారిక ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
Keerthy Suresh
Anotony
Tollywood

More Telugu News