Producer Ravi Shankar: డీఎస్‌పీతో వివాదంపై.. నిర్మాత రవిశంక‌ర్ ఏమ‌న్నారంటే..!

Pushpa Producer Ravi Shankar Clarify About Devisri Prasad Comments
  • చెన్నైలో 'పుష్ప: ది రూల్' ఈవెంట్‌లో మైత్రి నిర్మాత‌పై దేవిశ్రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మైత్రి రవిశంక‌ర్‌కు త‌న‌పై కంప్లైంట్స్ ఎక్కువ‌య్యాయ‌న్న‌ డీఎస్‌పీ
  • దేవిశ్రీతో త‌మ‌కు ఎలాంటి విభేదాలు లేవంటూ నిర్మాత వివ‌ర‌ణ‌
  • భ‌విష్య‌త్తులో ఆయ‌న‌తో క‌లిసి సినిమాలు చేస్తామ‌ని వ్యాఖ్య‌
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన 'పుష్ప: ది రూల్' ఈవెంట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన మైత్రి రవిశంక‌ర్‌కు త‌న‌పై కంప్లైంట్స్ ఎక్కువ‌య్యాయ‌ని డీఎస్‌పీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వివాదంపై తాజాగా మైత్రి నిర్మాత ర‌విశంక‌ర్ స్పందించారు.

దేవిశ్రీతో త‌మ‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో ఆయ‌న‌తో క‌లిసి సినిమాలు చేస్తామ‌ని తెలిపారు. "మా వాళ్ల‌కి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మ‌ధ్య కంప్లైంట్స్ ఎక్కువ‌య్యాయ‌ని డీఎస్‌పీ అన్నారు. ఆయ‌న‌ అన్న‌దాంట్లో మాకు త‌ప్పు క‌నిపించ‌లేదు. ప్రేమ‌తో పాటు ఫిర్యాదులు ఉంటాయి. దేవిశ్రీ అదే చెప్పారు. అంతే త‌ప్పితే ఆయ‌న‌కి వేరే ఉద్దేశం లేదు. దీనిని పెద్ద‌గా చేస్తూ మీడియా క‌థ‌నాలు రాసింది" అని ర‌విశంక‌ర్ పేర్కొన్నారు. సో.. ఆయ‌న వివ‌ర‌ణ‌తో ఈ వివాదానికి చెక్ ప‌డిన‌ట్లైంది.
Producer Ravi Shankar
Pushpa 2
Devisri Prasad
Tollywood
Mythri Movie Makers

More Telugu News