Acidity: యాసిడిటీతో బాధపడుతున్నారా?... సహజంగా రిలీఫ్ ఇచ్చే ఫుడ్స్​ ఇవే!

Are you suffering from acidity These are the foods that can reduce it

  • ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న యాసిడిటీ సమస్య
  • దానికి చికిత్సగా మందులు వాడుతున్న జనం
  • సహజ ఆహారంతోనే ఉపశమనం పొందవచ్చంటున్న నిపుణులు

పరిమితికి మించి తినడం, కూల్ డ్రింక్స్ అతిగా తాగడం, కడుపులో అల్సర్లు వంటివాటితో యాసిడిటీ సమస్య తలెత్తుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ఈ ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. అయితే తరచూ యాసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు... మందులతో ఉపశమనం పొందుతుంటారు. అలాగాకుండా కొన్ని రకాల ఆహారాన్ని తమ డైట్ లో భాగంగా చేసుకుంటే సహజ పద్ధతుల్లో యాసిడిటీని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.

అరటి పండ్లు 
అరటి పండ్లు స్వల్పంగా ఆల్కలైన్ (క్షార) స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే యాసిడిటీకి విరుగుడుగా పనిచేస్తాయి. అంతేకాదు అరటి పండ్లలోని పెక్టిన్ అనే ఎంజైమ్... మన జీర్ణాశయం, పేగుల లోపలి పొరపై ఒక రక్షణ పూతలా పేరుకుంటుంది. యాసిడిటీ వల్ల వచ్చే మంట, ఇతర ఇబ్బందులను తగ్గిస్తుంది.

దోసకాయలు
తరచూ తీసుకునే ఆహారంలో దోసకాయలు కూడా సహజమైన ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉన్నవే. అంతేకాదు వీటిలో నీటి శాతం కూడా ఎక్కువే. అందువల్ల అటు కడుపులోని యాసిడ్లను నిర్వీర్యం చేయడమే కాదు... శరీరం నుంచి బయటికి పంపడానికి కూడా తోడ్పడుతాయి. యాసిడిటీ సమస్యను తగ్గిస్తాయి. రోజూ ఓ పూట సలాడ్ గా దోసకాయ తింటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అవకాడోలు 
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. అదే సమయంలో ఆల్కలైన్ లక్షణాలు కూడా అవకాడోలకు ఉన్నాయి. ఇది యాసిడిటీని తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు అవకాడోల్లో విటమిన్లు, పొటాషియం వంటి ఖనిజాలవణాలు కూడా ఎక్కువే. మొత్తంగా ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. 

ఆకుకూరలు, కూరగాయలు
పాలకూర, కేల్ వంటి ఆకుకూరలు, క్యాబేజీ, బ్రాకొలీ వంటివి కూడా ఆల్కలైన్ లక్షణాలు ఉండేవే. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల యాసిడిటీ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వాటిలోని పోషకాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

చిలగడ దుంపలు
చిలగడ దుంపల్లోనూ ఆల్కలైన్‌ లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది యాసిడిటీని తగ్గించడంతోపాటు అల్సర్లు, ఇతర ఇబ్బందుల సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుందని వివరిస్తున్నారు.

అల్లం
శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్‌ ను తగ్గించడంలో అల్లం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో యాసిడ్లను నిర్వీర్యం చేసి ఉపశమనం ఇస్తుంది. అదే సమయంలో ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకూ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ, తర్బుజా
దోసకాయల తరహాలోనే పుచ్చకాయలు, తర్బూజా వంటివాటిలో కూడా ఆల్కలైన్‌ లక్షణాలు ఉంటాయి. అవి యాసిడిటీతోపాటు అల్సర్లు వంటివాటి ఇబ్బందులను తగ్గించడానికి తోడ్పడుతాయి.

బాదం
డ్రైఫ్రూట్స్ లో భాగమైన బాదం పప్పులు కూడా ఆల్కలైన్ లక్షణాలు ఉన్నవే. ఇవి యాసిడిటీని తగ్గించడంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి.

  • Loading...

More Telugu News