PCB: భారత జట్టు పాక్ రాకుంటే తర్వాత జరిగేదేంటో స్పష్టంగా చెప్పేసిన పీసీబీ

If India not travel to Pakistan then Pak wont travel in India says PCB

  • పాక్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆడకపోవడం ఆమోదయోగ్యం కాదన్న పీసీబీ చీఫ్ నక్వీ
  • తాము భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు మీరెందుకు రారని ప్రశ్న
  • భారత జట్టు పాక్ రాకుంటే తాము కూడా భారత్ రాబోమని తెగేసి చెప్పిన నక్వీ

చాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చీఫ్ మోసిన్ నక్వీ భారత్‌పై మరోమారు విమర్శలు చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆడకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. 2023 వన్డే ప్రపంచకప్ కోసం పాక్ జట్టు భారత్‌లో పర్యటించినప్పటికీ భారత్ మాత్రం నిరాకరించడం తగదన్నారు.

చాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ పాకిస్థాన్ క్రికెట్‌కు ఏది మంచిదైతే అదే చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఐసీసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, మొత్తం టోర్నీని పాక్‌లో నిర్వహించాలని కోరుకుంటున్నామని, ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఐసీసీతో స్పష్టంగా చెప్పామని, తర్వాత ఏం జరిగేది చెప్తామని పేర్కొన్నారు. 

భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదన్న విషయంపై బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి లిఖితపూర్వక సమాచారం లేదని వివరించారు. ఇండియా కనుక పాక్‌లో పర్యటించకుంటే.. పాకిస్థాన్ కూడా ఇండియాలో ఆడబోదని, ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్టు నక్వీ చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News