BRS: కాలేజీ యజమానికి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ విద్యార్థి నేత అరెస్ట్

BRS student leader arrest in threatening case
  • రూ.5 లక్షలు ఇవ్వాలని సీఎంఆర్ కాలేజీ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు
  • ప్రశాంత్ మరో పదిమంది బెదిరించినట్లుగా ఫిర్యాదు
  • నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
సీఎంఆర్ కాలేజీ యజమానికి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేత ప్రశాంత్‌ను హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్‌తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు.

ప్రశాంత్, మరో పదిమంది సీఎంఆర్ కాలేజీ యజమాని ఇంటికి వెళ్లి రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీనిపై సీఎంఆర్ కాలేజీ యజమాని ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
BRS
Congress
Hyderabad
Police

More Telugu News