Keerthy Suresh: తన పెళ్లిపై తిరుమలలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్

Keerthy Suresh gives clarity on her marriage
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్
  • వచ్చే నెల గోవాలో తన పెళ్లి జరగనుందని వెల్లడి
  • 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కీర్తి
సినీ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోంది. గోవాలో వచ్చే నెలలో తన పెళ్లి జరగనుందని కీర్తి సురేశ్ వెల్లడించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కీర్తి సురేశ్ ఈరోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

మరోవైపు, ఇటీవల కీర్తి సురేశ్ తన రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ ప్రేమలో ఉన్నానని... 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం వైవాహికబంధంగా కొనసాగనుందని చెప్పింది.

సినిమాల విషయానికి వస్తే... బాలీవుడ్ మూవీ 'బేబీ జాన్'లో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.  
Keerthy Suresh
Tollywood
Bollywood
Marriage

More Telugu News