Harish Rao: రాజీనామా చేయమంటే పారిపోయిన రేవంత్ రెడ్డిపై ఒక్క ఉద్యమ కేసైనా ఉందా?: హరీశ్ రావు

Harish Rao questions there is no Agitation cases against Revanth Reddy

  • తెలంగాణ ప్రకటనపై కేంద్రం వెనక్కి వెళ్ళినప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్న హరీశ్ రావు
  • ఉద్యమం సమయంలో రేవంత్, కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని విమర్శ
  • రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు మాత్రం ఉందని ఎద్దేవా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా? నాపై వందల కేసులు ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 2009లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకుందని, దీంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తు చేశారు.

ఆరోజు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారని... కానీ రేవంత్ రెడ్డి అప్పుడు రాజీనామా చేయకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పదన్నారు.

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమం కేసులు లేవని, కానీ ఓటుకు నోటు కేసు మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తారా? అని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డిపై మరకలు వెంటాడుతూనే ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడన్నారు. దుబ్బాక, గజ్వేల్‌లోనూ దీక్ష చేశారని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News