Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

Deep Depression in Bay Of Bengal intensified into Cyclone

  • బంగాళాఖాతంలో 'ఫెంగల్' తుపాను
  • గంటలకు 13 కిలోమీటర్ల వేగంతో పయనం
  • ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ సంస్థ

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆ సాయంత్రం తుపానుగా మారింది. ఈ తుపానుకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) 'ఫెంగల్' అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ తుపాను పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 13 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తోందని ఐఎండీ వెల్లడించింది. 

దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News