Nadendla Manohar: బియ్యం మాఫియా రాష్ట్రమంతా విస్తరించింది: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar says rice mafia spread state wide

  • కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం తనిఖీలు
  • పవన్ కల్యాణ్ తో కలిసి తనిఖీ చేసిన నాదెండ్ల
  • బియ్యం మాఫియాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. 

‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 51 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. దీనిలో 26 వేల టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించాం. సరకును సీజ్ చేసినా, దాన్ని కోర్టు నుంచి విడిపించేందుకు పెద్ద వ్యక్తుల ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి పారద్శకతతో పని చేస్తోంది. ప్రజా ధనాన్ని రక్షించాలనే బలమైన కాంక్షతో ప్రభుత్వం పని చేస్తోంది. 

బియ్యం మాఫియా వెనుక ఉన్న అసలు శక్తులను కచ్చితంగా బయటపెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ మాఫియా విస్తరించింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రజలకు అవసరం అయిన బియ్యం ప్రజలకే చెందేలా చూస్తాం" అన్నారు.

  • Loading...

More Telugu News