Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త
- ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇకపై 5 శాతం ఐఆర్
- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి
- తాజాగా ఉత్తర్వులు జారీ
తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ పెంచుతూ జీవో జారీ చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, యూనివర్సిటీల నాన్ టీచింగ్ స్టాఫ్, సహకార సొసైటీల ఉద్యోగులు, ఆయా సంస్థల పెన్షనర్లు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా మధ్యంతర భృతి అందుకోనున్నారు. మూల వేతనం (బేసిక్ పే)పై 5 శాతం ఐఆర్ పెంచుతున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వం గతేడాది అక్టోబరులో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఐఆర్ పెంచింది. తమకు కూడా పెంచాలన్న వివిధ వర్గాల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్ సర్కారు... ఆ మేరకు జీవో జారీ చేసింది.