USA: ట్రంప్ గద్దెనెక్కేలోగా తిరిగి వచ్చేయండి.. ఫారెన్ స్టూడెంట్లకు అమెరికా వర్సిటీల సూచన

US Colleges Urge Foreign Students To Return To Campus Ahead Of Trumps Swearing In
  • ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉందని ఆందోళనలు
  • ఇమిగ్రేషన్ ఫాలసీలలో మార్పులు చేయవచ్చని ప్రచారం
  • విదేశాల్లోని తమ ఉద్యోగులనూ పిలిపించుకుంటున్న వర్సిటీలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా యూనివర్సిటీలు తమ విదేశీ విద్యార్థుల కోసం గైడ్ లైన్స్ జారీ చేశాయి. ట్రంప్ గద్దెనెక్కి కొత్త ప్రభుత్వం కొలువుదీరేలోగా తిరిగి వచ్చేయాలని సూచించాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమలు చేసే ఇమిగ్రేషన్ పాలసీ వల్ల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. కొన్ని దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తమ విద్యార్థులు, ఉద్యోగులు కూడా వెంటనే తిరిగి రావాలని కోరాయి. ఈమేరకు అగ్రరాజ్యంలోని చాలా యూనివర్సిటీలు గైడ్ లైన్స్ జారీ చేశాయి. 

దేశంలో ప్రభుత్వం మారుతున్నపుడు పాలనకు సంబంధించి మార్పులు చోటుచేసుకోవడం సహజమేనని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అసోసియేట్ డీన్ డేవిడ్ ఎల్వెల్ పేర్కొన్నారు. వలస విధానంపై ట్రంప్ గట్టిగా పట్టుబడుతుండడం, ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయంపై హామీలు ఇవ్వడం వలసజీవుల్లో ఆందోళనను రేకెత్తించిందని చెప్పారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలతో విదేశీ విద్యార్థుల వీసా స్టేటస్ పై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తమ విద్యార్థులను జనవరి 20 లోగా తిరిగి వచ్చేయాలని సూచించినట్లు డేవిడ్ తెలిపారు. 
USA
Universities
America Colleges
Donald Trump

More Telugu News