Telugu Student: అమెరికాలో దుండ‌గుల‌ కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి!

Khammam Student Dies in Chicago Shooting
  • షికాగోలో దుండ‌గుల‌ కాల్పుల్లో ఖ‌మ్మం జిల్లా వాసి నూక‌ర‌పు సాయితేజ మృతి
  • ఎంఎస్ చ‌ద‌వ‌డానికి 4 నెల‌ల క్రిత‌మే యూఎస్ వెళ్లిన సాయితేజ‌
  • కుమారుడి మృతితో క‌న్నీరుమున్నీరు అవుతున్న పేరెంట్స్
అమెరికాలో తుపాకీ తూటాకు మ‌రో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. షికాగోలో దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో ఖ‌మ్మం జిల్లా రామ‌న్న‌పేట‌కు చెందిన నూక‌ర‌పు సాయితేజ (26) అనే విద్యార్థి చ‌నిపోయాడు. సాయితేజ ఎంఎస్ చ‌ద‌వ‌డానికి నాలుగు నెల‌ల క్రిత‌మే యూఎస్ వెళ్లాడు. ఇంత‌లోనే ఈ ఘోరం జ‌రిగిపోయింది. సాయితేజ మృతితో అత‌ని స్వ‌స్థ‌లం రామ‌న్న‌పేట‌లో విషాదం అలకుముంది. అత‌ని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. కుమారుడి మృత‌దేహాన్ని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చొర‌వ తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. 
Telugu Student
Chicago Shooting
USA
Khammam
Telangana

More Telugu News