Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు

Flight services cancelled from Telugu states due to Cyclone Fengal
  • బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను
  • చెన్నైలో వరదలు... విమానాశ్రయం మూసివేత
  • విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం
  • ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసుల నిలిపివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు చేశారు. అదే సమయంలో, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు కూడా రద్దయ్యాయి. 

అటు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దయ్యాయి. ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయాయి. 

ఫెంగల్ తుపాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దాంతో విమానాశ్రయాన్ని మూసివేశారు.
Cyclone Fengal
Flight Services
AP
Telangana
Chennai
Tamil Nadu

More Telugu News