RC16: రామ్ చరణ్ RC16లో బాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్‌... 'మున్నా భయ్యా' దివ్యేందు

Munna Bhayya Divyendu starring in Ram Charan RC16
  • రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో RC16
  • కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు దివ్యేందు
  • ఫస్ట్ లుక్ పంచుకున్న చిత్రయూనిట్
ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెంటనే ఆర్సీ16 సెట్స్ పైకి షిఫ్ట్ అయ్యాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ RC16 వర్కింగ్ టైటిల్ తో షురూ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. 

రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను మైసూర్‌లో ప్రారంభించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

ఈ పాన్ ఇండియా సినిమాలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. క‌న్నడ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్‌కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ దివ్యేందు ఇందులో కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. మీర్జాపూర్‌ మూవీలో 'మున్నా భయ్యా' పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన దివ్యేందు RC16తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. 

అలాగే టాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. ముఖ్యంగా, ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం. 

కాగా, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు దివ్యేందు పాత్రకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. తనకు RC16 చిత్రంలో ఎంతో ఇష్టమైన పాత్ర ఇదేనని పేర్కొంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు.  దివ్యేందు... ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెలి తిప్పిన మీసం, ర‌గ్డ్ లుక్‌తో కనిపిస్తున్నాడు.
RC16
Munna Bhayya Divyendu
Ramcharan
Sukumar
Tollywood
Pan India

More Telugu News