governor abdul nazeer: ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు పెంపు... చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

governor abdul nazeer approves amendment to retirement law in ap
  • ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 
  • న్యాయాధికారుల పదవీ విరమణను 60 ఏళ్ల నుంచి 61ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేసిన ఏపీ ప్రభుత్వం
  • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించిన న్యాయశాఖ
ఏపీలో ఉద్యోగ పదవీ విరమణ చట్ట సవరణకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు. న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఏపీలో జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు 60 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ సవరణ బిల్లును ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా, శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ పంపిన బిల్లును యథాతథంగా శాసనమండలి ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్ భవన్‌కు పంపగా, తాజాగా ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేశారు.  
 
governor abdul nazeer
approves amendment on retirement law
Andhra Pradesh
AP Assembly Session

More Telugu News