Peelings: పుష్ప-2 నుంచి 'పీలింగ్స్' సాంగ్ రిలీజ్.. కాసేపట్లోనే వ్యూస్ వెల్లువ

Peelings song out from Pushpa2 The Rule

  • డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప-2
  • అభిమానులకు ముందస్తు ట్రీట్ గా పీలింగ్స్ సాంగ్
  • గంటలోనే రెండు మిలియన్ల వ్యూస్

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మేనియా పీక్స్ కు చేరింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2: ది రూల్ చిత్రం డిసెంబరు 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పక్కా మాస్ మసాలా సాంగ్ రిలీజైంది. 

'పీలింగ్స్' అంటూ సాగే ఈ గీతానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఈ పాట ఆరంభంలో వచ్చే మలయాళ లిరిక్స్ ను సిజు తురావూర్ రచించారు. ఈ పాటలో బన్నీ మార్కు ఫుల్ ఎనర్జటిక్ స్టెప్పులను చూడొచ్చు. 'పీలింగ్స్' సాంగ్ యూట్యూబ్ లో విడుదలైన గంటలోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

  • Loading...

More Telugu News