New Planet: ఈ గ్రహంపై ఒక సంవత్సరం అంటే 21 గంటలే!

NASA found exoplanet similar to Neptune

  • సౌర కుటుంబానికి వెలుపల కొత్త గ్రహం
  • కనుగొన్న నాసా
  • నెప్ట్యూన్ ను పోలి ఉన్న గ్రహం

సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాల్లో నెప్ట్యూన్ కూడా ఒకటి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సౌర వ్యవస్థలకు వెలుపల ఒక చిన్న గ్రహాన్ని కనుగొంది. ఇది పరిణామంలో నెప్ట్యూన్ ను పోలి ఉంది. ఈ గ్రహానికి TOI-3261 b అని నామకరణం చేశారు. 

ఇది ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు నాసా గుర్తించింది. అయితే, ఆ నక్షత్రానికి అత్యంత సమీపంగా పరిభ్రమిస్తుండడంతో, ఈ గ్రహంపై ఓ సంవత్సరం అంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ గ్రహంపై ఓ ఏడాది అంటే కేవలం 21 గంటలే. 

ఇప్పటివరకు ఇలాంటి గ్రహాలు మూడే ఉన్నాయట. ఇది నాలుగో గ్రహం. బృహస్పతి తరహాలోనే ఈ కొత్త గ్రహంపైనా భారీగా వాయువులు నిండి ఉన్నట్టు నాసా పరిశోధనలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News