Ram Gopal Varma: అమెరికాలో కూడా ఇదే జరుగుతోంది: రామ్ గోపాల్ వర్మ

ram gopal varma Interesting comments on social media

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ
  • ఓ ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆర్జీవీ
  • ప్రస్తుత సోషల్ మీడియా పరిస్థితులను వివరించిన ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడుగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)పై కేసుల నమోదు అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లాలో నమోదైన కేసులో పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులు సైతం ఇచ్చారు. 

అయితే.. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన రామ్ గోపాల్ వర్మ .. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత తనపై వరుస కేసుల నమోదుపైనా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారన్న వార్తల నేపథ్యంలో ఆయన అజ్ఞాతం నుంచి సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తూ తాను ఎక్కడికీ పరారు కాలేదని చెబుతూ కేసుల నమోదుపై రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

తాజాగా ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై నమోదైన కేసులపై ఆర్జీవీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా న్యూస్, థంబ్‌నయిల్ బెటర్‌గా ఉండాలని,  నా న్యూస్ బెటర్‌గా ఉండాలని కోరుకునే కాంపిటీషన్ వరల్డ్‌‌లో ఉన్నామన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా ఇండియాలో జరుగుతున్న విషయం కాదు అమెరికాలో కూడా అదే జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ప్రపంచంగా క్రియేట్ అయిపోయిందని వర్మ చెప్పుకొచ్చారు. తాను ఏడాది క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై అప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు ఆ ట్వీట్ వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు పెట్టారు, పెడుతున్నారని ఆయన అన్నారు.         

  • Loading...

More Telugu News