Krish Arora: ఐక్యూలో స్టీఫెన్ హాకింగ్, ఐన్‌స్టీన్‌ను మించిపోయిన పదేళ్ల భారత సంతతి కుర్రాడు

10 year old Krish Arora genius surpasses Albert Einstein with IQ
  • పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌కు చెందిన క్రిష్ అరోరా
  • గణితం, క్రీడలు, సంగీతంలోనూ దిట్ట
  • 11 ప్లస్ ఎగ్జామ్స్ ఎంతో ఈజీ అన్న క్రిష్
  • ఐక్యూ టెస్టులో 162 స్కోరుతో ఐన్‌స్టీన్‌ను దాటేసిన చిన్నారి
  • చెస్‌లో టీచర్‌ను పలుమార్లు ఓడించిన వైనం
  • పియానోలో ఆరు నెలల్లోనే నాలుగు గ్రేడ్లు సాధించి ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలోని ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు
బ్రిటన్‌కు చెందిన పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్ అరోరా ఇంటెలిజెన్స్ కోషెంట్ (ఐక్యూ)లో ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్తలైన అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను మించిపోయాడు. పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌కు చెందిన క్రిష్.. గణితం నుంచి సంగీతం వరకు అన్ని రంగాల్లోనూ అత్యంత జీనియస్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐక్యూ టెస్ట్‌లో 162 స్కోరు సాధించాడు. ఈ క్రమంలో తన హీరోగా చెప్పుకునే ఐన్‌స్టీన్ కంటే రెండు మార్కులు ఎక్కువే సాధించడం గమనార్హం.

క్రిష్ తన మేధతో అత్యంత ఐక్యూ కలిగిన వారికి మాత్రమే పరిమితమైన ‘మేన్సా సొసైటీ’లో సభ్యత్వం సాధించాడు. నాలుగేళ్ల వయసులోనే గణిత పుస్తకాన్ని మూడు గంటల్లో పూర్తిచేసిన క్రిష్.. 8 ఏళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక్క రోజులోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. 11 ప్లస్ ఎగ్జామ్స్ చాలా ఈజీ అన్న ఈ కుర్రాడు తనకు స్కూలుకు వెళ్లాలని అనిపించదని, అక్కడ చిన్నచిన్న వాక్యాలు, చిన్నచిన్న లెక్కలు చేయడంతోనే సరిపోతోందని వాపోయాడు.

ఆల్‌జీబ్రా అంటే ఎంతో ఇష్టమన్న క్రిష్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్ స్కూల్‌లో చేరనున్నాడు. చెస్‌లోనూ అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాడు. కుమారుడికి చదరంగం నేర్పించేందుకు టీచర్‌ను పెడితే అతడినే ఓడించాడని ఆయన తండ్రి నిశ్చల్ చెప్పుకొచ్చారు. పియానోలో రెండేళ్లలోనే మాస్టర్ అయిపోయాడు. ఆరు నెలల్లోనే నాలుగు గ్రేడ్‌లు సాధించి ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలోని ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు సంపాదించాడు.
Krish Arora
London
IQ Test
Albert Einstein
Queen Elizabeth School

More Telugu News