Chalo Delhi: రైతుల 'ఛలో ఢిల్లీ'... ఢిల్లీ వెలుపలే అడ్డుకున్న పోలీసులు

Police stops farmers out side Delhi

  • పంటలకు మద్దతు ధర పెంచాలంటూ పంజాబ్ రైతుల డిమాండ్
  • 'ఛలో ఢిల్లీ'కి కదం తొక్కిన రైతులు
  • నోయిడా వద్ద అడ్డుకున్న పోలీసులు
  • రైతుల ఆందోళనతో ఢిల్లీ-నోయిడా రహదారిపై నిలిచిన రాకపోకలు 

పంటలకు మద్దతు ధర పెంచాలంటూ పంజాబ్ రైతులు నేడు 'ఛలో ఢిల్లీ' కార్యాచరణకు కదం తొక్కారు. అయితే, నోయిడాలోని దళిత్ ప్రేరణ్ స్థల్ వద్ద పంజాబ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వందలాది రైతులు ముందుకు రాకుండా పోలీసులు నిలువరించారు.

అయినప్పటికీ బారికేడ్లు తొలగించి ఢిల్లీ వైపు దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. రైతుల ఛలో ఢిల్లీ నేపథ్యంలో మూడంచెల భద్రత చర్యలు అమలు చేసిన పోలీసులు... రైతులు ముందుకు సాగకుండా ఆపేశారు. 

పోలీసులు భారీగా వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ షెల్స్ సిద్ధంగా ఉంచారు. అదనపు బలగాలను మోహరించి, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీ-నోయిడా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News