Day With CBN: 'డే విత్ సీబీఎన్'... సీఎం చంద్రబాబుతో ఒక రోజంతా గడిపిన ఎన్నారై ఉన్నం నవీన్

NRI Unnam Naveen spent one day with CM Chandrababu as part of Day With CBN

  • స్వీడన్ నుంచి వచ్చిన ఉన్నం నవీన్
  • ఎన్నికల సమయంలో 5 నెలల పాటు పార్టీ కోసం కృషి
  • పార్టీ కోసం పనిచేసిన వారికి సీఎంతో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పించిన పార్టీ
  • నవీన్ ను తన నివాసానికి ఆహ్వానించిన చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన 'డే విత్ సీబీఎన్' కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన ఎన్నారై ఉన్నం నవీన్ కుమార్ ను సీఎం చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో స్వీడన్ నుంచి వచ్చిన నవీన్ కుమార్  5 నెలల పాటు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు పిలుపు మేరకు వందల సంఖ్యలో ఎన్నారైలు సొంత రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును సీఎం చేసుకుంటే కలిగే లాభాలపై ప్రజలను చైతన్య పరిచారు. 

అలా నాడు విదేశాలనుంచి వచ్చి ఎన్నికల్లో పనిచేసిన వారికి గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా... నాటి సేవల్లో టాప్ లో ఉన్న వారిని పిలిచి గౌరవించాలని సీఎం చంద్రబాబు భావించారు. ఎన్ఆర్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు నేతృత్వంలో ఏపీకి వచ్చి పనిచేసిన ఎన్నారైలలో నవీన్ ముందు వరుసలో నిలిచారు.  

నాడు కుప్పం సహా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం నవీన్ చేశారు. ఈ క్రమంలో నాడు ప్రకటించినట్లు నవీన్ ను చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు. రోజంతా సీఎం నివాసంలో ఉన్న నవీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజూ వారీ రివ్యూలు, పనితీరును గురించి తెలుసుకున్నారు. 

రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్నారైలు వివిధ దేశాల నుండి ఎన్నికల సమయంలో సొంతూళ్లకు వచ్చి పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రం బాగుండాలనే బాధ్యతతో పని చేసిన ఎన్నారైలందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. 

దేశంలో ప్రముఖ నేత అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక రోజంతా ఉండడంపై నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబును అభిమానించే వారికి, నేడు తనకు ఇచ్చిన అవకాశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నవీన్ అన్నారు. స్వయంగా సీఎం ఒక రోజు పనితీరును దగ్గరుండి చూసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి నవీన్ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News