Bollywood: బాలీవుడ్ నటి సోదరి అమెరికాలో అరెస్టు

bollywood actress nargis fakhri sister arrested for double murder

  • బాలీవుడ్ నటి నర్గీస్ పక్రీ సోదరి అలియా ఫక్రీని అరెస్టు చేసిన నూయార్క్ పోలీసులు
  • జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అలియా ఫక్రీ
  • నవంబర్ 2న మాజీ బాయ్‌ఫ్రెండ్, అతని స్నేహితురాలిని సజీవ దహనం చేసిన అలియా ఫక్రీ

ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మాజీ బాయ్‌ప్రెండ్, అతని స్నేహితురాలిని సజీవదహనం చేసినట్లు అలియాపై అభియోగాలున్నాయి. 

న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ కొంత కాలం పాటు ఎడ్వర్ట్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ జాకోబ్‌కు అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని అలియా ఫక్రీ పలు మార్లు తన మాజీ బాయ్‌ప్రెండ్‌పై బెదిరింపులకు పాల్పడింది. 

ఈమె బెదిరింపులను ఖాతరు చేయకపోవడంతో నవంబర్ 2న జాకోబ్, ఆయన స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు వెళ్లిన అలియా ఆ ఇంటికి నిప్పు అంటించింది. ఇది గమనించిన స్థానికులు వారిని అప్రమత్తం చేసినప్పటికీ అప్పటికే వారు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.

ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు.. తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే సోదరి అరెస్టుపై నటి నర్గీస్ ఫక్రీ ఇంత వరకూ స్పందించలేదు.  

  • Loading...

More Telugu News