Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్
--
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు సోమవారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాక్ లాగ్ తో పాటు రెగ్యులర్ పోస్టుల నియామకం చేపడుతున్నట్లు వెల్లడించింది.
ఎంపికైన అభ్యర్థులను పీహెచ్ సీలతో పాటు ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిపింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బుదవారం (ఈ నెల 4) నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. దరఖాస్తులకు చివరి గడువు ఈ నెల 13 అని తెలిపింది. పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపికైన తర్వాత చెల్లించే జీతభత్యాలు ఇతరత్రా పూర్తి వివరాల కోసం వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.