BR Naidu: తిరుమలలో భక్తుల క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

TTD Chairman BR Naidu inspects que lines in Tirumala

  • భక్తులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్
  • భక్తుల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ
  • త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇవాళ తిరుమలలో భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"తిరుమలలో సామాన్య భక్తుల క్యూలైన్లను పరిశీలించాను. తొలుత ఏటీజీహెచ్ వద్ద ఉన్న స్లాటెడ్ సర్వదర్శనం ఎంట్రీ వద్ద పరిస్థితులను పరిశీలించాను. అనంతరం నారాయణగిరి షెడ్లను, దివ్యదర్శనం కాంప్లెక్స్ ను పరిశీలించాను. అక్కడ అమలవుతున్న విధానాల గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. దాంతోపాటే, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ను కూడా పరిశీలించి, భక్తుల నుంచి సూచనలు తీసుకున్నాను. త్వరలోనే దర్శన విధానాలపై సమగ్రంగా చర్చిస్తాం. సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం" అని బీఆర్ నాయుడు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News