NASA: మంచి రెస్క్యూ ప్లాన్ చెబితే 20 వేల డాలర్ల ప్రైజ్.. నాసా ప్రకటన

NASA Offers 20000 Dollors For Best Rescue Plan To Save Stranded Astronauts Like Sunita Williams

  • అనుకోని కారణాలతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోతున్న వ్యోమగాములు
  • వారిని క్షేమంగా భూమికి తీసుకు వచ్చేందుకు మెరుగైన ప్లాన్ కోసం పోటీ ఏర్పాటు
  • జనవరి 23 లోపు ప్లాన్ వివరాలు పంపించాలంటూ నాసా సూచన

అంతరిక్ష కేంద్రంలో వివిధ ప్రయోగాల కోసం వెళ్లే వ్యోమగాములు ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురైతే అక్కడే చిక్కుకుపోతారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ అలాగే చిక్కుకుపోయారు. మూడు నాలుగు వారాల పరిశోధన కోసం వెళ్లిన సునీతా విలియమ్స్ నెలల తరబడి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో వ్యోమగాములను భద్రంగా, తక్కువ ఖర్చుతో కాపాడి తీసుకొచ్చేందుకు ప్లాన్ చెప్పాలంటూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఓ పోటీ ఏర్పాటు చేసింది. లూనార్ మిషన్, అర్టెమిస్ మిషన్స్ ల సందర్భంగా ఇలాంటి అవాంతరాలు ఏర్పడితే వ్యోమగాములను భద్రంగా తరలించేందుకు ఉపయోగపడేలా ప్లాన్ ఉండాలని చెప్పింది.

ఆన్ లైన్ లో ఈ పోటీలో పాల్గొని మెరుగైన ప్లాన్ చెప్పిన వారికి 20 వేల డాలర్ల బహుమతి ఇస్తామని ప్రకటించింది. మన రూపాయల్లో సుమారు 17 లక్షలు గెల్చుకోవచ్చు. ఒక్క నాసా తరఫునే 20 వేల డాలర్లు కాగా ఇతరత్రా సంస్థల తరఫున ప్రకటించిన మొత్తం కూడా కలుపుకుంటే అన్నీ కలిపి 45 వేల డాలర్లు.. అంటే మన రూపాయల్లో 38 లక్షల పైమాటే. ఏ దేశ పౌరులు అయినా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆన్ లైన్ లోనే తగిన ప్లాన్ వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. జనవరి 23 వరకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి, అత్యుత్తమ ప్లాన్ చెప్పిన వారికి బహుమతి అందజేస్తామని నాసా ప్రకటించింది.

  • Loading...

More Telugu News