Kakinad Port Issue: ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు... జగన్ రెడ్డి: ఆనం

Anam Venkataramana Reddy press meet details

  • కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్
  • జగన్ జేబుదొంగ అని అప్పుడే చెప్పామని వెల్లడి
  • కేవీ రావును బెదిరించడం వెనుక జగన్ ఉన్నాడని ఆరోపణ

కేవీ రావు గొంతు మీద కత్తి పెట్టి రూ. 2 వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను రూ.12 కోట్లకు, కాకినాడ సీ పోర్టులో రూ. 2,689 కోట్ల విలువైన షేర్లను రూ. 494 కోట్లకే కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠా... వారి వెనుక ఉన్న జగన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని... వాస్తవాలను బయటపెట్టాలని... ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి  డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

అప్పుడు మా మాట ఎవరూ నమ్మలేదు!

జగన్ రెడ్డి జేబుదొంగ అని అనాడే  చెప్పాం. మా మాట నాడు ఎవరూ నమ్మలేదు. నేడు ఏకంగా సీఐడీ ఛార్జ్ షీట్  ఓపెన్ చేసింది. కాకినాడ సెజ్ విస్తీర్ణం 8,320 ఎకరాల్లో ఉంది. ఈ సెజ్ పై జగన్ రెడ్డి కళ్లు పడ్డాయి. వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ స్కాంలో జైల్లో ఉండి వచ్చిన శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో కలిసి బెదిరింపులకు దిగారు. దీంతో కేవీ రావు ఫిర్యాదుపై వారి పేర్లను ఛార్జ్  షీట్ లో పెట్టారు. కత్తులు, గన్నులు పెట్టి నాడు షేర్లు, భూములు కొట్టేసేందుకు కేవీరావును బెదిరించారు.

కాకినాడ డీప్ సీ పోర్టును కైవసం చేసుకోవడానికి... శ్రీకాంత్ రెడ్డి, శరత్ రెడ్డిని జగన్ రెడ్డి రంగంలోను దింపి  పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఆడిట్ సంస్థ, క్రోల్ ఇండియా అనే ఆడిట్ సంస్థలతో 28 రోజులు అక్రమ ఆడిట్ చేయించి.. ప్రభుత్వానికి రూ. 1000 కోట్లు కట్టాలని కేవీ రావును బెదిరించారు. ఒకే కంపెనీని ఇద్దరు కన్సెల్టెంట్లతో ఆడిట్ చేసి ఒత్తిడి తెచ్చారు. 

చెన్నై నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి?

రూ. 1000 కోట్లు కట్టకుంటే కేసులు పెడతామని బెదిరించి సీ పోర్టులో వాటాల బదిలీకి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోర్టును స్వాధీనం చేసుకుంటామని భయపెట్టారు. షిప్పింగ్ ఏజెంట్ లను కూడా  భయపెట్టారు. చివరకు  కేవీ రావు గొంతు మీద కత్తి పెట్టి 41% శాతం వాటాను కొట్టేశారు. అసలు చెన్నై నుండి ఆడిటర్లు ఇక్కడకు వచ్చి ఆడిట్ చేయడం ఏంటి? ఏపీలో ఆడిటర్ లు లేరా? ప్రభుత్వం ఆడిట్ చేయవచ్చు కదా? 

ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో ఏ1 గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు... జగన్ రెడ్డి. కర్త కర్మ క్రియ అన్ని కూడా జగన్ రెడ్డినే. డీజీపీ, సీఐడీ దీన్ని గుర్తించి జగన్ రెడ్డిని ఏ1 గా నమోదు చేయాలి... అని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News