Vikranth Reddy: కాకినాడ పోర్టు-సెజ్ వ్యవహారం: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విక్రాంత్ రెడ్డి

Vikranth Reddy approaches high court for anticipatory bail
  • కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ఆరోపణలు
  • ఏ1గా వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి
  • ఈ వ్యవహారంతో తనకు సంబంధంలేదని స్పష్టీకరణ
కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేసు కూడా నమోదైంది. విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో, విక్రాంత్ రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి స్పష్టం చేశాడు. 

వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్

ఇక సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి నర్సీపట్నం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినందుకు వర్రా రవీంద్రారెడ్డిపై కేసు నమోదైంది. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించిన నేపథ్యంలో అతడిని పోలీసులు విశాఖ జైలుకు తరలించారు.
Vikranth Reddy
Kakinada Port
SEZ
KV Rao
AP High Court
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News