cm fadnavis: ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ తొలి సంతకం చేసిన ఫైలు ఇదే!

in his first decision cm fadnavis approves aid for patient awaiting bone marrow transplant

  • మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్
  • బోన్‌మ్యారో చికిత్స కోసం ఎదురుచూస్తున్న బాధితుడు చంద్రకాంత్ 
  • ఆర్ధిక సాయం అందించే దస్త్రంపై తొలి సంతకం చేసిన సీఎం ఫడ్నవీస్

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా రాష్టంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 

అయితే, సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫడ్నవీస్ .. తన తొలి సంతకాన్ని ఒక రోగికి ఆర్ధిక సాయం అందించే దస్త్రంపై చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పుణెకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి బోన్‌మ్యారో మార్పిడి చికిత్స కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందుకు అతని భార్య సీఎం సహాయ నిధి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తోంది. 

ఈ క్రమంలో బాధితుడికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని సీఎం ఫడ్నవీస్ నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ రోగికి సంబంధించి వైద్య ఖర్చులకు గానూ ఆర్ధిక సాయం అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు.  

  • Loading...

More Telugu News