KTR: దళితబంధు అడిగితే కేసులు పెడుతున్నారు: కేటీఆర్

KTR fires on Congress

  • ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందన్న కేటీఆర్
  • సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని వ్యాఖ్య
  • అంబేద్కర్ అభయహస్తం తెస్తామని చెప్పి దాని ఊసెత్తడం లేదని విమర్శ

ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దళితబంధు డిమాండ్ చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది బీఆర్ఎస్ నేతలను కాదని... అంబేద్కర్ ను అని అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించామని కేటీఆర్ చెప్పారు. నగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు. దళతబంధును తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామని చెప్పారని... ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News