Telangana: చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులతో.. తెలంగాణ తల్లి రూపం ఇదే!

New Telangana Thalli statue revealed
  • సగటు మహిళను దృష్టిలో పెట్టుకొని తయారు చేశామంటున్న ప్రభుత్వ వర్గాలు
  • విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలి చిత్రీకరణ
  • సచివాలయ ప్రాంగణానికి తరలించిన 17 అడుగుల విగ్రహం
తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది. అయితే ఈ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ ఈరోజు వీడింది.

బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు.

తెలంగాణ సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల ఈ విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు.
Telangana
Telangana Thalli
Congress
Hyderabad

More Telugu News