home gaurds: హోంగార్డులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- హోంగార్డుల డీఏ పెంచుతూ ఉత్తర్వుల జారీ
- రూ.921 నుంచి రూ.1000 వరకూ డీఏ పెంపు
- వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200లకు పెంపు
తెలంగాణ సర్కార్ రాష్టంలోని హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల డీఏ (కరవు భత్యం) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి వెయ్యి రూపాయల వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200లకు పెంచింది.
అలాగే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.