Puspha2: చరిత్ర సృష్టించిన పుష్ప2.. రెండవ రోజు కలెక్షన్లు ఎంతంటే..!

Allu Arjun starrer Puspha2 earned Rs 400 crores worldwide in 2 days
  • రెండవ రోజు ఇండియాలో రూ.90.1 కోట్ల వసూలు
  • రెండు రోజుల్లో రూ.400 కోట్ల మైలురాయి
  • అన్ని వెర్షన్లలో మంచి ఆక్యుపెన్సీతో ప్రదర్శన
అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పుష్ప2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమా విడుదలైన రెండవ రోజైన శుక్రవారం ఈ మూవీ ఇండియాలో ఏకంగా రూ.90.1 కోట్లు వసూలు చేసింది. దీంతో పుష్ప2 రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా  రూ.400 కోట్లు రాబట్టిందని బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు వెల్లడించే ‘శాక్‌నిల్స్’ కథనం పేర్కొంది. రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లలో ఒక్క ఇండియాలోనే రూ.265 కోట్లు వసూలు చేసిందని వివరించింది. కాగా రెండవ రోజున విదేశాల్లో నమోదైన కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.

కాగా పుష్ప2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా పుష్ప2 హవా కొనసాగింది. అన్ని వెర్షన్‌లలో ఆక్యుపెన్సీ అద్భుతంగా కనిపించింది. తెలుగులో 53 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక హిందీలో 51.65 శాతం, తమిళంలో 38.52 శాతం, కన్నడలో 35.97 శాతం, మలయాళంలో 27.30 శాతం ఆక్యుపెన్సీతో చక్కటి వసూళ్లు రాబట్టింది.
Puspha2
Allu Arjun
Movie News
Tollywood
Rashmika Mandanna

More Telugu News