Chandrababu: పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో చంద్రబాబు, నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh in parents teachers meeting
  • బాపట్ల మున్సిపల్ స్కూల్ లో చంద్రబాబు, లోకేశ్
  • విద్యార్థిని మార్క్స్ రిపోర్టును పరిశీలించిన సీఎం
  • ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని సూచన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్లలో పర్యటిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని... యూనివర్శిటీ స్థాయి వరకు ట్రాకింగ్ జరగాలని చెప్పారు. ఈ ట్రాకింగ్ వల్ల ఏ విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉంది... సదరు విద్యార్థి ఏం చదివితే బాగుంటుందనే విషయం అర్థమవుతుందని అన్నారు. 

9వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో చంద్రబాబు ముచ్చటించారు. విద్యార్థిని మార్క్స్ రిపోర్టును ఆయన పరిశీలించారు. ఆమె ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రూమ్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఇంకోవైపు కడప మున్సిసల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు.
Chandrababu
Nara Lokesh
Parents Teachers Meeting
Telugudesam

More Telugu News