IAF: హుస్సేన్ సాగర్ తీరంపై వాయుసేన రిహార్సల్స్... వీడియో ఇదిగో!
--
భారత వాయుసేనకు సంబంధించిన సూర్యకిరణ్ విమానాల బృందం హుస్సేన్ సాగర్ తీరంలో గగనతలంలో కనువిందు చేయనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏరోబాటిక్ ప్రదర్శన జరగనుంది. ఈ షోలో వాయుసేనకు చెందిన జెట్ విమానాలు పలు విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం రిహార్సల్స్ నిర్వహించారు.
హ్యాక్ ఐ132 అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సూర్యకిరణ్ టీమ్ చేసిన విన్యాసాలు సందర్శకులను అబ్బురపరిచాయి. దాదాపు 25 నిమిషాలపాటు జెట్ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఈ ఏరోబాటిక్ ప్రదర్శన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.