BJP: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ డెడ్‌లైన్

Bandi Sanjay dead line to CM Revanth Reddy
  • అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతు భరోసా ఎక్కడ? అని ప్రశ్న
  • రైతు భరోసాకు సంక్రాంతి డెడ్ లైన్ విధిస్తున్నట్లు వెల్లడి
  • ఆ తర్వాత కాంగ్రెస్ నేతలను రోడ్లపై తిరగనివ్వమని అల్టిమేటం
రైతు భరోసా నిధులకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతు భరోసా ఎక్కడ? అని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఇస్తామన్న నిధులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి తర్వాత కూడా ఇవ్వకుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నేతనూ రోడ్లపై తిరగనివ్వబోమని అల్టిమేటం ఇచ్చారు.

ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు క్యాడర్ లేదని, ఇక పార్టీ లీడర్ ఫాం హౌస్‌లోనే ఉన్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమం కేసు లేదని, కానీ ఓటుకు నోటు కేసు ఉందని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి మాట్లాడే భాష విషయంలో కేసీఆర్‌ను మించిపోయారని, భాష విషయంలో ఆయనకు తాత లాంటి వాడని చురకలు అంటించారు. రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అన్నారు. 20 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి... 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. 
BJP
Revanth Reddy
Bandi Sanjay
Telangana

More Telugu News