mohammed shami: టీమిండియాకు శుభవార్త... సిసలైన పేసర్ వచ్చేస్తున్నాడు!

mohammed shami set to play last 2 tests in australia after fitness clearance

  • బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సీనియర్ బౌలర్ మహ్మద్ షమి
  • ఎన్‌సీఏ వైద్య బృందం నుంచి క్లియరెన్స్ రాగానే ఆసీస్‌కు బయలుదేరనున్న షమి
  • ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్న షమి

టీమిండియాకు ఇది గుడ్ న్యూస్. గాయం నుంచి కోలుకున్న టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. షమి ఫిట్‌నెస్‌పై జాతీయ క్రికెట్ అకాడమి (ఎన్‌సీఏ) వైద్య బృందం మరి కొద్ది రోజుల్లో క్లియరెన్స్ ఇవ్వనుందని, ఆ వెంటనే షమి ఆస్ట్రేలియా పయనం కానున్నారని సమాచారం. 

ఈ క్రమంలోనే షమి వీసా కూడా సిద్ధమయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే అతనికి సంబంధించిన క్రికెట్ కిట్‌ను ఆస్ట్రేలియాకు పంపారని అంటున్నారు. షమి ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని, అతను ఫిట్‌గా ఉన్నాడని బెంగాల్ హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా పేర్కొన్నాడు. 

భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న షమీ .. ఇటీవల రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడి మధ్యప్రదేశ్‌పై ఐదు వికెట్లు సాధించి ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. ఈ టీ 20 టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతుండగా, బెంగాల్ కూడా నాకౌట్‌కు అర్హత సాధించింది. డిసెంబర్ 9న ప్రిక్వార్టర్స్‌లో చండీగఢ్, బెంగాల్ తలపడనున్నాయి. బెంగాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎన్‌సీఏ మెడికల్ బృందం .. షమి ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తారని సమాచారం.  

ఆసీస్, భారత్ మధ్య డిసెంబర్ (26 -30) నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు, మెల్‌బోర్న్), జనవరి 03-07 మధ్య ఐదో టెస్టు (సిడ్నీ) జరగనున్నాయి. 

  • Loading...

More Telugu News