Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం .. నలుగురు దుర్మరణం

road accident in palnadu dist

  • పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో గీతికా స్కూల్ వద్ద చెట్టును ఢీకొట్టిన కారు
  • ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి
  • మృతులు నెల్లూరుకు చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తింపు
  • తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై గీతికా స్కూల్ వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

మృతులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వీరు కొత్త కారుకు పూజలు చేయించేందుకు కొండగట్టుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా దుర్ఘటన జరిగింది.  

  • Loading...

More Telugu News