Uppal Railway Station: హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లు

Several trains stopped in Uppal railway station due to signaling problem
    
హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో అరగంటకుపైగా నిలిచిపోయాయి. సింగరేణి ప్యాసింజర్ రైలు ఉప్పల్ స్టేషన్‌లో 20 నిమిషాలు ఆగిపోయింది. అలాగే, మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు కూడా నిలిచిపోయింది. 

సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్బోవీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైళ్లను పంపించిన అధికారులు, సిగ్నలింగ్ వ్యవస్థను సరిచేస్తున్నారు.
Uppal Railway Station
Hanamkonda
Kamalapur

More Telugu News