Husband Sucide: భార్యను చంపిన భర్త పశ్చాత్తాపం.. చిత్తూరులో భార్య సమాధి వద్దే ఆత్మహత్య

Husband Commits Suicide Beside wifes Grave In Chittoor

  • క్షణికావేశంలో భార్యను చంపేసి జైలుకు
  • ఆరు నెలల తర్వాత బెయిల్ పై విడుదల
  • భార్య సమాధి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్న భర్త

భార్యతో గొడవపడ్డ ఓ భర్త క్షణికావేశంలో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భార్య చనిపోయింది. దీంతో జైలుపాలైన భర్త ఆరు నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి భార్య సమాధి వద్దే ఉరి వేసుకుని చనిపోయాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఆదివారం జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులు బెంగళూరుకు వలస వెళ్లారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. మనస్పర్థల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆరు నెలల క్రితం ఇద్దరూ గొడవ పడగా తీవ్ర ఆవేశానికి లోనైన గంగిరెడ్డి కత్తితో సుజాతపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సుజాత అక్కడికక్కడే చనిపోయింది. అటుపై పోలీసులకు లొంగిపోయిన గంగిరెడ్డిని కోర్టు జైలుకు పంపించింది.

ఆరు నెలల పాటు జైలులో గడిపిన గంగిరెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. శనివారం సొంతూరు బైపరెడ్లపల్లిలోని ఇంటికి వచ్చిన గంగిరెడ్డి.. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేశాడు. తెల్లారి తండ్రి కనిపించకపోవడంతో పిల్లలు ఊరంతా వెతకగా.. సుజాత సమాధి వద్ద ఓ చెట్టుకు వేలాడుతున్న గంగిరెడ్డి మృతదేహం కనిపించింది. భార్యను చంపేసినందుకు పశ్చాత్తాపంతోనే గంగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News