Amitabh Bachan: అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారనే ప్రచారంపై అమితాబ్ ఏమన్నారంటే..!

What Amitabh Bachan Said About Abhishek And Aishwarya Rai Separation Rumours
  • రూమర్స్ ప్రచారం చేసేవాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిగ్ బీ
  • ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదంటూ మండిపడ్డ వైనం
  • తమ తప్పులను దాచి ఇతరుల లోపాలను వెతుకుతారంటూ ట్వీట్
బాలీవుడ్ సెలబ్రెటీ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట ఎవరికి వారుగా ఫంక్షన్లకు హాజరు కావడం, ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ కనిపించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదని, మనం ఏం మాట్లాడినా దానికి కుత్సిత మెదడుతో తమకు కావాల్సిన అర్థం తీస్తారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులలో లేని లోపాలను వెతుకుతుంటారని అన్నారు.

మెదడులేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని దురదృష్టాలను దాచి, ఇతరుల మాటల్లో ప్రతీ పదానికీ పెడార్థం తీస్తారంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ కాలం దాంపత్య జీవనం గడిపిన వారు కూడా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ ఓ సామాజిక సమస్యపై చర్చ కోసం చేసిన ఈ ట్వీట్ ను ఆయన సొంత జీవితానికి ఆపాదించి అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అమితాబ్ పరోక్షంగా చెప్పారు.
Amitabh Bachan
Big B
Abhishek Bachan
Aishwarya Rai
Divorce
Aish Divorce

More Telugu News