TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
- 5 బిల్లులు, 2 నివేదికలను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- రైతు భరోసా విధివిధానాలపై చర్చించే అవకాశం
- సంతాప తీర్మానాల తర్వాత సభ వాయిదా పడే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 కీలక బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రైతు భరోసా విధివిధానాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.