Revanth Reddy: ఎల్లుండి నుంచి మూడ్రోజుల పాటు జైపూర్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- డిసెంబర్ 11 నుంచి 13 వరకు ఇతర రాష్ట్రాల్లో సీఎం పర్యటన
- మొదటి రోజు జైపూర్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో పర్యటించనున్న సీఎం
- సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యనేతలు వెళ్లే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు జైపూర్, ఢిల్లీలో పర్యటించనున్నారు. డిసెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట వ్యక్తిగత పనుల నిమిత్తం రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్ళనున్నారు. ఆ తర్వాత రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తారు.
ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల మంత్రులు, అధికారులతో చర్చిస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ ఆయన సమావేశమవుతారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ వరకు వాయిదా పడ్డాయి ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యనేతలు కూడా ముఖ్యమంత్రితో ఢిల్లీకి వెళ్లే అవకాశముంది.