Chandrababu: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

CM Chandrabbau announces Rajyasabha candidates

  • ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు
  • టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సాన సతీశ్... బీజేపీ నుంచి కృష్ణయ్యకు చాన్స్
  • డిసెంబరు 20న పోలింగ్ 

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కూటమి నేడు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సాన సతీశ్... బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు పోటీ చేస్తారని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. 

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. డిసెంబరు 20న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు చేపడతారు.

  • Loading...

More Telugu News