CM Revanth Reddy: భావోద్వేగ క్షణం... మన తల్లి అవతరణం: సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

CM Revanth Reddy Emotional Tweet on Thalli Telangana Statue

    


రాష్ట్ర‌ స‌చివాల‌యంలో సోమ‌వారం తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. 'భావోద్వేగ క్షణం... మన తల్లి అవతరణం' అంటూ సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  

"భావోద్వేగ క్షణం... మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం... తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా... నిలువెత్తు నీ రూపం... సదా మాకు స్ఫూర్తిదాయకం" అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. దీనికి నిన్న‌టి తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌మ‌యంలో తీసిన వీడియోను ఆయ‌న జోడించారు. 

  • Loading...

More Telugu News